Thursday, January 09
Breaking News:

రాజమండ్రి చేరుకున్న బాలకృష్ణ లోకేష్,పవన్‌తో కలిసి చంద్రబాబుని కలవనున్న బాలకృష్ణ

1694673115_q1.jpg

టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ రాజమండ్రి చేరుకున్నారు. కాసేపటి క్రితమే ఆయన రాజమండ్రి వెళ్లారు. నేడు ఆయన పవన్‌, లోకేష్‌తో కలిసి చంద్రబాబును కలవనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు వీరు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు. దాదాపు 40 నిమిషాలు వీళ్లు చంద్రబాబుతో ములాఖత్‌లో ఉంటారు. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఇవాళ ఉదయం 10 గంటలకు పవన్, బాలకృష్ణ రాజమండ్రికి చేరుకోనున్నారు. చంద్రబాబును కలిసిన తర్వాత.. ముగ్గురు ప్రత్యేకంగా సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించనున్నారు. అయితే ములాఖత్‌ తర్వాత పవన్‌ ఏం మాట్లాడుతారనే దానిపై అటు టీడీపీ, ఇటు జనసేన కేడర్‌ తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తోంది.

Prev Post అనంత్‎నాగ్‎లో కాల్ప...
Next Post నిరంతరాయంగా కొనసాగుత...

More News