శ్రావణమాసం నాలుగోవ సోమవారం సందర్భంగా వేములవాడ రాజన్న క్షేత్రం భక్తుల ఓం నమశ్శివాయ శివ నామ స్మరణతో మారుమోగింది
శ్రావణమాసం నాలుగోవ సోమవారం పుష్కరించుకొని ఆలయ ప్రధాన అర్చకులు అప్పాల భీమశంకర్ శర్మ ఆధ్వర్యంలోని అర్చకులు శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి అభిషేకములు, శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి లలితా సహస్రనామ చతుష్టోపచార పూజలు వేదమంత్రాలతో నిర్వహించారు అనంతరం భక్తులు స్వామివారికి తలనీలాల సమర్పించి ధర్మగుండంలో సానాలు ఆచరించి స్వామి వారి ప్రీతిపాత్రమైన కోడెమొక్కులు చెల్లించి, స్వామివారి దర్శనానికి క్యూలైన్లో బారులు తీరారు భక్తులు స్వామి వారికి అభిషేకములు అన్న పూజలు నిర్వహించి అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు స్వామి వారి దర్శనానికి దాదాపు 8 గంటల సమయం పడుతుంది