అణువణువునా సేవా గుణం
కెఎస్ఆర్ ఫౌండేషన్ పేరుతో అనేక కార్యక్రమాలు
పేదల పాలిటి పెన్నిధిగా మన్ననలు
తాజాగా ప్రెషర్ కుక్కర్ల పంపిణీకి శ్రీకారం
కంది శ్రీనన్నకు వెల్లువెత్తుతున్న ప్రశంసలు
ఇప్పటికే అనేక సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎన్నారై, కెఎస్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ కంది శ్రీనివాస రెడ్డి మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారంచుట్టారు.
మహిళలకు ఒక అన్నగా చిరుకానుకలు అందించేందుకు సంకల్పించారు.కెఎస్ ఆర్ ఫౌండేషన్ తరపున ప్రెషర్ కుక్కర్లు అందించారు.సోదరీ సోదరుల మధ్య అనురాగానికి గుర్తయిన రాఖీ పౌర్ణమి రోజున ఆదిలాబాద్ పట్టణంలోని తాటిగూడ కాలనీలో ఈ బృహత్తర కార్యక్రమాన్ని కాలనీ ప్రముఖులు కాలనీ వాసుల మధ్య ప్రారంభించారు. రాజకీయాలకు అతీతంగా ఇంత మంచి సేవా సంకల్పాన్ని భుజాని కెత్తుకున్న కంది శ్రీనివాస రెడ్డిని జిల్లా వాసులు అభినందించారు. సామాజిక సేవ చేయడంలో శ్రీనివాస రెడ్డికి మించిన వారు లేరని ప్రశంసించారు. డబ్బు అనేక మంది వద్ద ఉంటుందని కాని పరోపకారం ,సేవ చేయాలన్న తలంపు కొందరికే ఉంటుందని అది తమ ప్రాంత వాసి కంది శ్రీనివాస రెడ్డి కి ఉండటం తమ అదృష్టమని ఆయన ఇలాగే మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగించాలని ఆకాంక్షించారు.ఇక ప్రజలకు సేవ చేసే శక్తిని తనకు భగవంతుడు ఇచ్చాడని తన ప్రాంత వాసులకు సేవా కార్యక్రమాలుచేయడం తన అదృష్ట మన్నారు.ప్రజా బలం ఆశీర్వాదాలతోనే తాను నిత్యాన్న దానం, ఆంబులెన్స్,త్రాగునీటి పంపిణీ,పెళ్లికానుకలు లాంటి ఎన్నోచేయగలుగుతున్నానన్నారు. తన సంపాదనలో 50శాతం ప్రజా సేవకే కేటాయిస్తానని తాను ముందునుండే చెబుతున్నానని అదే మాటకు కట్టుబడి సేవలు కొనసాగిస్తున్నట్టు తెలిపారు. ప్రెషర్ కుక్కర్ల లో అన్నం వండితే పోషక విలువలు ఉంటాయన్న కారణంతోనే వీటి పంపిణీ చేపగుతున్నట్టు వివరించారు. ఇంకా ఏదైనా చేయాలన్న తలంపు నిత్యం మదిలో ఉంటుందని , పేదలకు వైద్యసహాయం అందించే ఆలోచన చేస్తున్నట్టు ఇలా మరిన్ని ప్రజోపయోగ కార్యక్రమాలను భవిష్యత్తలో చేపట్టనున్నట్టు తెలిపారు. తమ కాలనీకి వచ్చి కుక్కర్లు పంచిన కంది శ్రీనివాస రెడ్డి సేవాగుణాన్ని కొనియాడుతూ కాలనీ వాసులు ధన్యవాదాలు తెలిపారు.