రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ లో నిర్వహించ తలపెట్టిన సీడబ్ల్యూసీ సమావేశాల షెడ్యుల్ ను కాంగ్రెస్ అధిష్టానం విడుదల చేసింది. సెప్టెంబర్ 16,17,18 తేదీలలో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు ఈ మూడు రోజుల పాటు జరగబోయే కార్యక్రమాల వివరాలను ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ విడుదల చేశారు. 16వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు తెలంగాణ పీసీసీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. మధ్యాహ్నం 2 గంటలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీతో మీటింగ్ జరగనుంది. 17వ తేదీ ఉదయం 10:30 కి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నాయకులు,కౌన్సిల్, ఆఫీస్ బేరర్లు-సీపీపీలతో సమావేశం జరగనుంది. సాయంత్రం 5 గంటలకు విజయ భేరి సభలో 5 గ్యారంటీ స్కీమ్స్, బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఛార్జిషీట్ ప్రకటన విడుదల చేయనున్నారు. అనంతరం 119 నియోజకవర్గాల్లో ముఖ్య నేతల ప్రకటన, రాత్రి అసెంబ్లీ నియోజకవర్గాల్లో నేతలు బస చేయనున్నారు. 18వ తేదీ ఉదయం కార్యకర్తలతో ముఖ్యనేతల సమావేశం, 5 గ్యారెంటీ స్కీమ్స్ పై డోర్ టూ డోర్ క్యాంపెయిన్ మధ్యాహ్నం కార్యకర్తల ఇళ్లలో లంచ్ కార్యక్రమం ఉండనుంది. సాయంత్రం స్థానికంగా ఉంటే మహాత్మాగాంధీ, అంబేద్కర్, కొమురం భీమ్ విగ్రహా వద్దకు భారత్ జోడో యాత్ర మార్చ్ నిర్వహించనున్నారు.