Thursday, January 09
Breaking News:

‘ఇంటర్నేషనల్‌ సౌండ్‌ అండ్‌ ఫిల్మ్‌ మ్యూజిక్‌ ఫెస్టివల్‌’లో హాలీవుడ్‌ సినిమాలతో ‘బలగం’ పోటీ

1694418431_vv.jpg

తెలంగాణ సంస్కృతి, కుటుంబ బంధాల నేపథ్యంలో తెరకెక్కి విజయం సాధించిన చిత్రం ‘బలగం’. ‘ఇంటర్నేషనల్‌ సౌండ్‌ అండ్‌ ఫిల్మ్‌ మ్యూజిక్‌ ఫెస్టివల్‌’లో హాలీవుడ్‌ సినిమాలతో ‘బలగం’ పోటీ పడుతోంది. ‘బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌ ఫీచర్‌’ కేటగిరీలో ఈ సినిమాకి నామినేషన్‌ దక్కింది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్‌ మీడియా వేదికగా తెలిపింది.

ఈ ఫెస్టివల్‌లో 82 దేశాల నుంచి 1074 సినిమాలు పలు విభాగాల్లో పోటీ పడుతున్నాయి. అక్టోబరు 14న క్రొయోషియాలో జరగనున్న వేడుకలో విజేతలను ప్రకటించనున్నారు. కేవలం సంగీతానికి సంబంధించి ఇచ్చే అవార్డులివి. కొన్ని నెలల క్రితం.. 13వ దాదాసాహెబ్‌ ఫాల్కే చిత్రోత్సవాల వేదికపై ఈ చిత్ర సంగీత దర్శకుడు భీమ్స్‌ సిసిరోలియో ఉత్తమ సంగీత దర్శకుడిగా పురస్కారాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.

ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌రామ్‌, సుధాకర్‌రెడ్డి, మురళీధర్‌ గౌడ్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని వేణు యెల్దండి తెరకెక్కించారు.
బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో ‘ఒనికో ఫిల్మ్‌ అవార్డు (ఉక్రెయిన్‌)’, బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌, బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ సినిమాటోగ్రఫీ విభాగాల్లో లాస్‌ ఏంజిల్స్‌ సినిమాటోగ్రఫీ అవార్డు, ‘వాషింగ్టన్‌ డీసీ ఇంటర్నేషనల్‌ సినిమా ఫెస్టివల్‌’లో బెస్ట్‌ ఫీచర్‌ డైరెక్టర్‌, బెస్ట్‌ యాక్టర్‌ ఇన్‌ ఏ ఫీచర్‌, బెస్ట్‌ యాక్ట్రెస్‌ ఇన్‌ ఏ ఫీచర్‌, బెస్ట్‌ నెరేటివ్‌ ఫీచర్‌ విభాగాలతోపాటు మరికొన్ని పురస్కారాలు సొంతం చేసుకుంది ‘బలగం’.

Prev Post సెప్టెంబర్ 17.. జాతీ...
Next Post శ్రావణమాసం నాలుగోవ...

More News