Friday, January 10
Breaking News:

అత్యంత అవినీతి పార్టీ బీఆర్ఎస్ కుటుంబ0 - తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి

1692859414_bjp.jpg

అత్యంత అవినీతి పార్టీ బీఆర్ఎస్ కుటుంబమని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి విమర్శించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గ మండలం లోని సి హెచ్ ఆర్ గార్డెన్ లో జితేందర్ రెడ్డి అధ్యక్షతన బుధవారం జరిగిన బూత్ సమ్మేళనం సమావేశానికి ముఖ్యఅతిథి గా హాజయ్యారు. ఎ సందర్బంగా అయన మాట్లాడుతూ కేసీఆర్ ను గద్దె దించి బుద్ది చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. 1200ల మంది ఆత్మబలిదానాలు చేసుకుని తెలంగాణని సాధిస్తే... తన వళ్లే తెలంగాణ వచ్చిందంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని, ఎన్నికల ముందు కేసీఆర్ మరోసారి రైతుల రుణమాఫీ అంటూ మభ్యపెడ్తున్నాడని మండిపడ్డారు.
 దళితబందు గులాబీ నాయకులకే ఇస్తున్నారని.. అందులో కూడా 30 శాతం కమీషన్ లు తీసుకుంటున్నారని ఆరోపించారు. లిక్కర్ కేసు నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు దొంగనాటకాలు ఆడారన్నారు. ఇంటికో ఉద్యోగమన్న కేసీఆర్... నిరుద్యోగాన్ని పెంచుతున్నారని మండిపడ్డారు.కల్వకుంట్ల కుటుంబం చేసే మోసాల్ని ప్రజలకు చెప్పాల్సిన సమయం వచ్చిందని చేవెళ్ల నియోజకవర్గం లో బీజేపీ గెలుపే లక్షంగా ప్రతి కార్యకర్త కృషి చెయ్యాలని పేర్కొన్నారు

Prev Post టిఆర్ఎస్ పార్టీ నాంప...
Next Post క్యాన్సర్ కంటే ముఖ్య...

More News