Thursday, January 09
Breaking News:

ఆయుష్మాన్ రాజేంద్రనగర్ ఆరోగ్య రథం ఏర్పాటు చేసి పేద ప్రజలకు వైద్య సేవలు - తోకల శ్రీనివాస్ రెడ్డి

1694690052_q1.jpg

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా మైలర్ దేవ్ పల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి ఆయుష్మాన్ రాజేంద్రనగర్  ఆరోగ్య రథం ఏర్పాటు చేసి పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు.

రాజేంద్ర నగర్ నియోజకవర్గం బండ్ల గూడ జగిర్ కార్పొరేషన్ పరిధిలోనీ బైరాగి గుడ, వికర్ సెక్షన్ కాలనీ, గందం గూడ రాజీవ్ గృహకల్ప కాలనీ లో పేద ప్రజలకు ఆయుష్మాన్ రాజేంద్రనగర్ కార్యక్రమంలో భాగంగా  కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి ఆరోగ్య రథం లో ఉచిత వైద్య శిబిరన్ని  ఏర్పాటు చేశారు.. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజల పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకున్నారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని పేద ప్రజల కు మెరుగైన వైద్యం అందించే దిశగా ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య రథాన్ని ఏర్పాటు చేసి పేద ప్రజల వద్దకే ఆరోగ్య రథాన్ని పంపించి సేవలందిస్తున్నట్లు తెలిపారు.

Prev Post ప్రభుత్వ ప్రధాన కార్...
Next Post ముఖ్యమంత్రి కేసీఆర్...

More News