Thursday, January 09
Breaking News:

కాకతీయ వైద్య కళాశాలలో ర్యాగింగ్ కు పాల్పడిన ఏడుగురిపై కేసు నమోదు

1694952097_sdsds.jpg

కాకతీయ వైద్య కళాశాలలో ర్యాగింగ్ కు పాల్పడిన ఏడుగురిపై యాంటీ ర్యాగింగ్ తో పాటు294/b,323, 340ipc సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని వరంగల్ ఏసిపి బోనాల కిషన్ తెలిపారు. కాకతీయ వైద్య కళాశాల మరోసారి వార్తల్లోకి ఎక్కింది ప్రీతి ఘటన మరువకముందే సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థి పై రాగింగ్ కలకలం రేపింది ఈనెల 14వ తేదీన రాత్రి మనోహర్ అనే మొదటి సంవత్సరం వైద్య విద్యార్థి పై రెండు సంవత్సరం చదువుతున్న అభినవ్ మోరే అతని మిత్రులు మనోహర్ కు మద్యం తాగించి నృత్యాలు చేయించి చితకబాదారు దీంతో మనోహర్ అతని తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు మట్టేవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏడుగురు రెండో సంవత్సరం చదువుతున్న వైద్య విద్యార్థులపై ఆంటీ రాయితోపాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు పూర్తి కాలేదని ఈ ఘటనలో సుమారు 20 మంది విద్యార్థులు ఉన్నారని వారు ఎందుకు రాత్రి ఉన్నారో విచారణ చేపట్టిన అనంతరం పూర్తి వివరాలు తెలుపుతామని ప్రస్తుతం ఏడుగురిపై కేసు నమోదు చేశామని వరంగల్ ఎసిపి బోనాల కిషన్ తెలిపారు

Prev Post పాలేరు నియోజకవర్గంలో...
Next Post సైదాబాద్ లో ఘనంగా జా...

More News