Thursday, January 09
Breaking News:

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఇవాళ హైదరాబాద్‌కు

1694846022_20230905259L.jpg

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఇవాళ హైదరాబాద్‌కు రానున్నారు. ఇవాళ రాత్రికి మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ నుంచి నగరానికి చేరుకొని సీఆర్​పీఎఫ్ సెక్టార్‌ ఆఫీసర్‌ మెస్‌లో బస చేస్తారు. రేపు ఉదయం 9 గంటలకు పరేడ్‌గ్రౌండ్‌లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే విమోచన దినోత్సవంలో పాల్గొంటారు.సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగే సభలో అమిత్ షా పాల్గొననున్నారు.అనంతరం బీజేపీ ముఖ్య నేతలతో సమీక్ష నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రముఖ బాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధుతో పాటు ఆమె కుటుంబ సభ్యులను అమిత్‌ షా కలుస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి.

Prev Post పాలమూరు ప్రాజెక్టును...
Next Post రాష్ట్రంలోని ములుగు...

More News