Friday, January 10
Breaking News:

కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 15న పార్లమెంటరీ పార్టీ సమావేశం

1694500124_KCR-rainfall-telangana.jpg

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై చర్చించేందుకు బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ.. ఈ నెల 15న సమావేశం కానుంది. ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం ఈ భేటీ జరగనుంది. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు సమావేశానికి తప్పకుండా హాజరు కావాలని కేసీఆర్ కోరారు. ఈ నెల 18 నుంచి జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చించనున్నారు.జమిలి ఎన్నికలు, దేశం పేరు మార్పు వంటి కీలక అంశాలు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో చర్చకు రావచ్చునని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇతర అంశాలపై చర్చకు కాంగ్రెస్, ఇండియా కూటమిలోని ఇతర పార్టీలు పట్టుబట్టే అవకాశం ఉంది. చట్ట సభల్లో మహిళల రిజర్వేషన్‌లపై చర్చ జరపాలని ఎమ్మెల్సీ కవిత వివిధ పార్టీలకు లేఖ రాశారు. వీటన్నింటిపై బీఆర్‌ఎస్‌ వైఖరిని కేసీఆర్ నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు.

Prev Post గిరిజనోద్ధారకుడు సీఎ...
Next Post కేసీఆర్ కెబినేట్ లోద...

More News