బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌పై తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘ఎవడిదిరా బానిసత్వ పార్టీ’ అని ప్రశ్నించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కేటీఆర్ కలిసిన తర్వాత కవిత లిక్కర్ కేసు ఆగిపోయిందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లూ కేటీఆర్‌కు కొంత నాజెడ్జ్ ఉందనుకున్నానని.. కానీ, ఇవాళ్టి మీడియా చిట్ చాట్ తర్వాత కేటీఆర్‌కు ఏం తెలియదని స్పష్టమైందని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే ఉద్యమ సమయంలో ఆయన్ను బండ బూతులు తిట్టిన దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ద్రోహులను పార్టీలో చేర్చుకొని నియంతలా కేసీఆర్ ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.