Friday, January 10
Breaking News:

కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి పోటీ

1693030064_1653102823881 (1).png

టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నారు. కొడంగల్ నుండి టికెట్ కేటాయించాలని ఆయన పార్టీ అధిష్టానికి విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తును కొడంగల్ నియోజకవర్గం కాంగ్రెస్ కార్యకర్తలు గాంధీభవన్‌లో టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్‌కు సమర్పించారు.

మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య తరఫున జనగామ నుండి ఆయన అనుచరులు పార్టీకి దరఖాస్తును చేసుకున్నారు. ఇప్పటి వరకు గాంధీభవన్‌కు పార్టీ టికెట్ల కోసం దాదాపు 600 దరఖాస్తులు చేరినట్లు తెలిసింది. టికెట్ల కోసం దరఖాస్తు చేసుకోడానికి రేపటితో గడువు ముగియనుండడంతో చివరి రోజు భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Prev Post కడియం శ్రీహరికి ఘన స...
Next Post చంద్రుడి ఉపరితలంపై 8...

More News