Tuesday, December 03
Breaking News:

కొనసాగుతున్న స్క్రీనింగ్ కమిటీ సమావేశం 119 నియోజవర్గాలలో అభ్యర్ధుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు

1693811652_Congress.jpg

స్క్రీనింగ్ కమిటీ చైర్మన్, ఎంపీ కే.మురళీధరన్‌కు శంషాబాద్ విమానాశ్రయంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు.
ఈ నేపధ్యంలో గాంధీభవన్‌లో పీఈసీ సభ్యులతో స్క్రీనింగ్ కమిటీ ప్రారంభమైంది. ఇదిలా ఉండగా ఈ దఫా కాంగ్రెస్ పార్టీ 119 నియోజకవర్గాలకు 
భారీ పోటీ నెలకొంది. అయితే సిట్టింగులు, మాజీలు, సీనియర్ల క్రైటీరియాతో దాదాపు 25 నుంచి 30 సీట్లు ఇప్పటికే ఫైనల్ కాగా.. 
మిగతా సెగ్మెంట్లలో అభ్యర్థులు ఎంపికపై ఇప్పుడు కసరత్తు జరుగుతుంది. 
నిన్న జరిగిన పీఈసీ సమావేశంలో ఆయా సెగ్మెంట్లకు ముగ్గురు అభ్యర్థుల చొప్పున కమిటీ సభ్యులు మార్క్ చేసినట్లు సమాచారం. 
మూడు రోజులపాటు స్క్రీనింగ్ కమిటీ ఒక్కో పీఈ సీ సభ్యుడితోటి ముఖాముఖీ నిర్వహించనున్నది.
 ప్రస్తుతం మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో 28 మంది పీఈసీ సభ్యులు ఉన్నారు.

Prev Post తెలంగాణలో అసెంబ్లీ ఎ...
Next Post తెలంగాణ బీజేపీలో మరో...

More News