Friday, January 10
Breaking News:

జోగు రామ‌న్న ఓట‌మే ల‌క్ష్యం-కంది శ్రీ‌నివాస రెడ్డి

1693560378_aab.jpg

సీఆర్ఆర్ ఆశ‌యానిక‌నుగుణంగా క‌లిసి ప‌ని చేస్తాం
ఆయ‌న స్పూర్తి తోనే రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌ట్టు వెల్ల‌డి 
కాంగ్రెస్ కుటుంబ‌మంతా ఒక్క‌టై విజ‌యం సాధిస్తాం 
త‌న తాత సీఆర్ఆర్ జ్ఞాప‌కార్ధం ఉత్త‌మ విద్యార్ధుల‌కు అవార్డులు
సీఆర్ఆర్ కాంస్య విగ్ర‌హ ఏర్పాటుకు డిమాండ్ 

 ఆదిలాబాద్ కాంగ్రెస్ దిగ్గ‌జ నేత త‌న తాత‌గారైన దివంగ‌త చిలుకూరి రామ‌చంద్రారెడ్డి జ్ఞాప‌కార్ధం ప్ర‌తీ సంవ‌త్స‌రం త‌న ఫౌండేష‌న్  త‌ర‌పున ఉత్త‌మ విద్యార్ధుల‌కు అవార్డులు ప్ర‌దానం చేయ‌త‌ల‌చిన‌ట్టు కాంగ్రెస్ నాయ‌కులు కెఎస్ ఆర్ ఫౌండేష‌న్ చైర్మ‌న్ కంది శ్రీ‌నివాస రెడ్డి తెలిపారు. త‌న క్యాంపు కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయ‌న మాట్లాడారు. చిల్కూరి రామచంద్రారెడ్డి లాంటి గొప్ప రాజకీయనేతలు చాలా అరుదుగా ఉంటార‌న్నారు. అలాంటి నిష్క‌ల్మ‌ష నేత‌పై సోషల్ మీడియా ద్వారా అనుచిత, అసత్య ప్రచారాలను కంది శ్రీ‌నివాస రెడ్డి ఖండించారు.  ఆయ‌న  స్ఫూర్థితోనే త‌ను రాజకీయాల్లోకి వ‌చ్చిన‌ట్టు తెలిపారు. ఫౌండేషన్ ద్వారా చేసే సేవల కంటే రాజకీయాల ద్వారా మరింత ఎక్కువగా ప్రజాసేవ చేయొచ్చనేది ఆయన్ను చూసే తెల్సుకున్నాన‌ని తెలిపారు. మంత్రిగా ,ఎమ్మెల్యేగా జిల్లాకే వ‌న్నెతెచ్చిన అలాంటి గొప్ప‌వ్య‌క్తి సేవ‌ల‌కు గుర్తుగా ఆయ‌న  కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న‌ట్టు తెలిపారు. అలాగే విశాల‌ స్థ‌లంలో  ఆయ‌న పేరుపై ఙ్ఞానభూమి ఏర్పాటు చేయాల‌న్నారు. చెనాక-కోరట బ్యారేజ్ కు చిలుకూరి రామ‌చంద్రారెడ్డి పేరు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున డిమాండ్ చేస్తున్న‌ట్టు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే జోగురామ‌న్నను ఓడించాల‌నేది సీఆర్ఆర్ ఆశ‌యంగా ఉండేద‌ని ఆ ఆశ‌య సాధ‌న‌కోసం తామంతా క‌లిసిక‌ట్టుగా ప‌నిచేసి ఆదిలాబాద్ లో పార్టీ గెలుపుకోసం  ఐక్యంగా కృషిచేస్తామ‌న్నారు. ఈ మీడియా స‌మావేశంలో గిమ్మ సంతోష్, భరత్ వాగ్మరే,నాగర్కర్ శంకర్,MA షకీల్, అల్లూరి అశోక్ రెడ్డి , రాజ్ మొహమ్మద్, మీరా ,రవీందర్ రెడ్డి,షేక్ మన్సూర్, ముఖీమ్, అంజద్ ఖాన్, కర్మ, పోతారాజు సంతోష్, కిష్టా రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Prev Post మీకు నేను...నాకు మీర...
Next Post అభివృద్ధి చేశా... మీ...

More News