Friday, January 10
Breaking News:

తెలంగాణ బీజేపీలో మరో నేతపై సస్పెన్షన్ వేటు

1693812068_51391948136_625x300_0.jpg

బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ అయ్యారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడంటూ యెన్నం శ్రీనివాస్ రెడ్డిని బీజేపీ సస్పెండ్ చేసింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు యెన్నం శ్రీనివాస్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించారు. కాగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన రెండో వ్యక్తి యెన్నం శ్రీనివాస్ రెడ్డి అని చెప్పవచ్చు.

ఇటీవల బీజేపీ పార్టీ లైన్ క్రాస్ చేశాడని తెలంగాణ ఉద్యమకారుడు, బీజేపీ నేత జిట్టా బాలకృష్ణ రెడ్డిని కూడా పార్టీ నుంచి కిషన్ రెడ్డి సస్పెండ్ చేశారు. తాజాగా మరో మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం తెలంగాణ బీజేపీలో హాట్ టాపిక్ గా మారింది.

Prev Post కొనసాగుతున్న స్క్రీన...
Next Post బిఆర్ఎస్ పార్టీతోనే...

More News