Tuesday, December 03
Breaking News:

తెలుగు రాష్ట్రాలకు మళ్లీ వర్షాలు

1694673511_Telangana-Monsoons.jpg

తెలుగు రాష్ట్రాలకు మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.తెలంగాణలో పలు ప్రాంతాలకు ఎల్లో అలెర్ట్ కూడా జారీ చేసింది.అలాగే రానున్న రెండు రోజులు రాష్ట్రంలో తేలిపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని ప్రకటించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల,కరీంనగర్,పెద్దపల్లి,ములుగు,భూపాలపల్లి, వరంగల్,హనుమకొండ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.నగరంలోనూ చిరు జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు అధికారులు. అటు ఏపీలోను ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Prev Post నిరంతరాయంగా కొనసాగుత...
Next Post ‘ఇండియా’ కూటమి తొలి...

More News