ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌లో నిరుద్యోగ సమస్యలపై బీజీపే చేపట్టిన 24 గంటల ధర్నా ప్రారంభమైంది.బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, ఈటల, డీకే అరుణ, బండి సహా ఇతర కీలక నేతలు ఈ ధర్నాకు తరలివచ్చారు. గురువారం ఉదయం 11 గంటల వరకు ధర్నా చేయనున్నారు.సీఎం కేసీఆర్.. హామీ ఇచ్చి విస్మరించిన నిరుద్యోగభృతిని వడ్డీతో సహా చెల్లించడంతోపాటు నిరుద్యోగుల సమస్యలన్నీ పరిష్కరించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేయనున్నారు.