Friday, January 10
Breaking News:

నాణాలతో తులాభారం.. మురిసిపోయిన మంత్రి శ్రీనివాస్ గౌడ్...

1693631340_aab.jpg

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మేదర సంఘం సభ్యులు మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు నాణాలతో తులాభారం చేసి అభిమానాన్ని చాటుకున్నారు. మహబూబ్ నగర్ పట్టణంలోని బండ్లగేరిలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రికి మేదర సంఘం సభ్యులు తప్పట్లు తాళాల, నృత్యాలు చేస్తూ క్రేన్ సహకారంతో గజమాల వేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను మేదర సంఘం సభ్యులు, మహిళలు పెద్ద ఎత్తున సన్మానించారు.
అనంతరం రూ.18,002 నాణాలతో మంత్రిని తులాభారం చేశారు. ఈ డబ్బులను నామినేషన్‌కు వినియోగించుకోవాలని సంఘ సభ్యులు సూచించారు. మేదర సంఘ సభ్యులు, మహిళలు తనపై వినూత్నమైన రీతిలో అభిమానాన్ని చాటుకోవడం పట్ల మంత్రి ఆనందంతో మురిసిపోయారు. ఆత్మీయ సమ్మేళనం అనంతరం క్రిస్టియన్ పల్లి సమీపంలో డబుల్ బెడ్ రూమ్‌ల వద్ద మేదర సంగం కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మీ అందరి ఆదరాభిమానాలతో మహబూబ్ నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అందరూ అబ్బురపడేలా తీర్చి దిద్దుతామన్నారు. అందుకు మీరు అందరూ అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు...

Prev Post వాల్యూ గోల్డ్ సంస్థన...
Next Post నేడు జీహెచ్ఎంసీ పరిధ...

More News