Thursday, January 09
Breaking News:

పాలమూరు ప్రాజెక్టును ప్రారంభించనున్న ముఖ్యమంత్రి

1694845903_kcr-2.jpg

తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇవాళ ప్రారంభం కానుంది.ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాజెక్టును ఈరోజు ప్రారంభించనున్నారు. నార్లాపూర్‌లో తొలి పంపు స్విఛ్‌ ఆన్‌ చేయనున్నారు. పాలమూరు-రంగారెడ్డి పైలాన్‌ ఆవిష్కరించనున్నారు. డెలివరి సిస్టర్న్‌ వద్ద సీఎం ప్రత్యేక పూజలు చేసి గంగాహారతి ఇవ్వనున్నారు. కలశాల్లో కృష్ణా జలాలు గ్రామాలకు చేరవేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవం అనంతరం కొల్లాపూర్ బహిరంగ సభలో కేసీఆర్‌ ప్రసంగించనున్నారు. సీఎం సభకు భారీ జనసమీకరణలో గులాబీ నేతలు నిమగ్నమయ్యారు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటిస్తున్న క్రమంలో జిల్లాలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

Prev Post సోనియా సమక్షంలో కాంగ...
Next Post కేంద్ర హోంశాఖ మంత్రి...

More News