Thursday, January 09
Breaking News:

భాగ్యనగరం వేదికగా కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటీ సమావేశాలు

1694845569_a.jpg

18 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో జరుగుతున్న సీడబ్ల్యూసీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. తాజ్ కృష్ణ హోటల్ లో ఇవాళ,రేపు రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ భేటీలో కాంగ్రెస్‌ అధిష్టానం కీలకనిర్ణయాలు తీసుకోనుంది. 

సీడబ్ల్యూసీ సమావేశాల్లో ఐదు కీలక అంశాలపై కాంగ్రెస్ పార్టీ చర్చించే అవకాశం ఉంది. తెలంగాణతో పాటు త్వరలో ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు, భారత్ జోడో యాత్ర-2 నిర్వహణ, 2024 లోక్ సభ ఎన్నికలు, ఇండియా కూటమిలో పార్టీల మధ్య సీట్ల కేటాయింపు పై చర్చించున్నారు. ముఖ్యంగా సోమవారం నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో అనుసరించాల్సి వ్యూహాలపై కూడా చర్చించనున్నారు. ముఖ్యంగా ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ అధికారం దక్కేలా ప్రణాళికపై కూడా చర్చలు జరపనున్నారు. కొద్ది నెలల్లో తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మిజోరంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ ఎన్నికలే టార్గెట్ గా సీడబ్యూసీ సమావేశాలు హైదరాబాద్ లో నిర్వహించాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ క్రమంగా బలపడుతోంది. ఈ క్రమంలో ఇక్కడ సీడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహించడం వల్ల పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నిండనుంది

 ఇదిలా ఉండగా సోనియా గాంధీ సమక్షంలో పలువురు కీలక నేతలు కాంగ్రెస్‌లో చేరనున్నారు.మాజీ మంత్రి తుమ్మల సోనియాగాంధీ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. మరికొందరు నేతలు కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, బీజేపీ నుంచి సస్పెండ్ అయిన జిట్టా బాలకృష్ణారెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నివాసంలో నేడు జిట్టా కాంగ్రెస్‌ పార్టీలో చేరనుండగా, వేముల వీరేశం 18 లేదంటే 19న ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు

Prev Post రాష్ట్రానికి రానున్న...
Next Post సోనియా సమక్షంలో కాంగ...

More News