Thursday, January 09
Breaking News:

మహిళలకు కంది శ్రీనన్న కానుక

1694849448_WhatsApp Image 2023-09-16 at 11.41.44 AM.jpeg

కుక్క‌ర్ల పంపిణీతో దూసుకుపోతున్నకంది
కంది శ్రీ‌నివాస రెడ్డికి జ‌న నీరాజ‌నం
ప్ర‌తీ ఇంటికి కుక్క‌ర్ కంది శ్రీ‌న‌న్న ల‌క్ష్యం 
నిరంత‌రం ప్ర‌జాక్షేత్రం లో కంది శ్రీ‌న‌న్న 
మా శ్రీ‌న‌న్న‌ను గెలిపిస్తామంటున్న జ‌నం 
ఎమ్మెల్యేగా చూడాల‌ని త‌పిస్తున్న అభిమానులు
వాడ‌వాడ‌లా కంది శ్రీ‌నివాస‌రెడ్డికి జేజేలు

ఆదిలాబాద్ లో ఇప్ప‌టివ‌ర‌కు ఎవ‌రూ చేయ‌ని ,మ‌రెవ‌రికీ సాధ్యంకాని రీతిలో కెఎస్ఆర్ ఫౌండేష‌న్ ద్వారా అనేక సామాజిక సేవాకార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు కెఎస్ఆర్ ఫౌండేష‌న్ చైర్మ‌న్ ,ఎన్నారై , కాంగ్రెస్ నాయ‌కులు కంది శ్రీ‌నివాస రెడ్డి.ఆయ‌న తాజాగా ఎంచుకున్న ప్రెష‌ర్ కుక్క‌ర్ల పంపిణీకి అపూర్వ స్పంద‌న క‌న‌ప‌డుతోంది. ఇప్ప‌టికే ఆదిలాబాద్ ప‌ట్ట‌ణంలోని అనేక కాల‌నీల‌లో  కుక్క‌ర్లు పంపిణీ చేసారు. వాడ‌వాడ‌లా జ‌నం ఆయ‌న‌కు జేజేలు ప‌లుకుతున్నారు. ప్ర‌జా ప్ర‌తినిధులుగా చెలామ‌ణిలో ఉన్న‌వారు ఇప్ప‌టివ‌ర‌కు త‌మ‌కు ఎలాంటి కానుక‌లు ఇవ్వ‌లేద‌ని కాని ఎలాంటి అధికారం ప‌ద‌వి లేకున్నా కంది శ్రీ‌నివాస రెడ్డి త‌మ‌కోసం త‌మ కాల‌నీల‌కు వ‌చ్చి కుక్క‌ర్లు పంపిణీ చేయ‌డం ప‌ట్ల మ‌హిళ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ లాంటి పేద‌ల‌కు కంది శ్రీ‌న‌న్న దేవుడిచ్చిన అన్నగా అభివ‌ర్ణిస్తున్నారు. త‌ప్ప‌కుండా త‌మ మ‌ద్ద‌తు ఆయ‌న‌కే ఉంటుంద‌ని ప్ర‌జ‌ల గురించి ఆలోచించే కంది శ్రీ‌నివాస రెడ్డికే త‌మ ఓటు వేసి గెలిపిస్తామంటున్నారు. నిరంత‌రం ఆదిలాబాద్ అభివృద్ధికై ప‌రిత‌పించే త‌మ అభిమాన నేత కంది శ్రీ‌న‌న్న ఎమ్మెల్యే కావాల‌ని జ‌నం కోరుకుంటున్నారు

Prev Post మలక్‌పేట్ కేర్ హాస్ప...
Next Post వినాయక చవితి వేడుకలు...

More News