Friday, January 10
Breaking News:

మీకు నేను...నాకు మీరు అంటున్న ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం.

1693560146_aab.jpg

భద్రాచల మండల బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు చుక్కా సుధాకర్ ఆధ్వర్యంలో ప్రతి నెల మాదిరిగానే 1వ తేది జరిగిన కార్మికశాఖ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న భద్రాచలం నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్మికుల సమస్యల పై మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క పథకం కార్మికులకు అందే విధంగా నా వంతు కృషి 'మీకు నేను' చేస్తానని వారికి హామీ ఇచ్చారు.'నాకు మీరు' బలంగా వెన్నెంటు తోడు ఉండాలి అని,నా యొక్క గెలుపు కోసం కృషి చేయాలని వారిని అభ్యర్థించారు.మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని భద్రాచల నియోజకవర్గ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించి కెసిఆర్ గారికి కానుకగా ఇవ్వాలని.భద్రాచలం నియోజకవర్గంని అభివృద్ధి దిశలో తీసుకువెళ్తానని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు తెలిపారు.ఈ యొక్క కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు రత్నం రమాకాంత్,చింతాడి చిట్టిబాబు,ఎండి నవాబ్,జాయింట్ సెక్రెటరీ బొంబోతుల రాజీవ్,మండల యూత్ అధ్యక్షులు గాడి విజయ్,మండల సెక్రెటరీ ఆకుల వెంకట్,కోశాధికారి మాచినేని భాను,ట్రేడ్ యూనియన్ కార్యదర్శి ఎస్కె రహీం వీరితో పాటు పుల్లారావు,నాగేంద్ర,గాంధీ పలువురు యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.

Prev Post రక్షాబంధన్ తో పాటు వ...
Next Post జోగు రామ‌న్న ఓట‌మే ల...

More News