Friday, January 10
Breaking News:

మ‌ర‌పురాని మ‌హానేత‌కు కంది శ్రీ‌న‌న్న ఘ‌న నివాళి

1693653731_WhatsApp Image 2023-09-02 at 3.50.49 PM.jpeg

ప్ర‌జా సేవాభ‌వ‌న్ లో వ‌ర్ధంతి కార్య‌క్ర‌మం 
రాజ‌న్న రాజ్యం రామ‌రాజ్య‌మ‌న్న శ్రీ‌న‌న్న‌
పేద‌ల జీవితాల్లో వెలుగులు నింపిన కాంతికిర‌ణం 
వైఎస్ఆర్ ఒక లెజెండ్

చెర‌గ‌ని చిరున‌వ్వుతో ,అనేక సంక్షేమ ప‌థ‌కాల‌తో ప్ర‌జ‌ల గుండెల్లో చిర‌స్థాయిగా గూడుక‌ట్టుకున్న మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అని కాంగ్రెస్ రాష్ట్ర‌నాయ‌క‌లు కంది శ్రీ‌నివాస రెడ్డి అన్నారు.ఆదిలాబాద్ ప‌ట్ట‌ణంలోని కంది శ్రీ‌నివాస రెడ్డి క్యాంపు కార్యాల‌యం ప్ర‌జాసేవాభ‌వ‌న్ లో వైఎస్ఆర్ 14వ వ‌ర్ధంతిని జ‌రుపుకున్నారు. ఆయ‌న చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి ఘ‌న‌నివాళ్లు అర్పించారు. 2004 లో రాజ‌శేఖ‌ర్ రెడ్డి ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత రైతుల జీవితాల్లో వెలుగులు నింపార‌ని కంది శ్రీ‌నివాస రెడ్డి ఆయ‌న సేవ‌ల‌ను స్మ‌రించుకున్నారు. ఎన్నో సంక్షేమ ప‌థ‌కాల‌తో జ‌నాద‌ర‌ణ పొందార‌న్నారు. అనంత‌రం 2009 లోనూ ముఖ్య‌మంత్రి అయ్యార‌ని  ర‌చ్చ‌బండ కార్య‌క్ర‌మానికి వెళ్తూ దుర్మ‌ర‌ణం చెందార‌న్నారు. ఆయ‌న ఆశ‌యాల‌కు అనుగుణంగా న‌డుచుకున్న‌ప్పుడే ఆ మ‌హ‌నీయునికి నిజ‌మైన నివాళి అర్పించిన‌ట్ట‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో గిమ్మ సంతోష్,భరత్ వాగ్మరే ,MA షకీల్,పుండ్రు రవి కిరణ్ రెడ్డి,అయ్యుబ్ ఖాన్, చాన్ పాషా,అస్బాత్ ఖాన్, హరీష్ రెడ్డి, మహమూద్, సంతోష్ రెడ్డి, నాగన్న, పోతారాజు సంతోష్ త‌దిత‌రులు  పాల్గొన్నారు.

Prev Post నేడు జీహెచ్ఎంసీ పరిధ...
Next Post వైఎస్ఆర్ తెలంగాణ పార...

More News