Thursday, January 09
Breaking News:

రానున్న ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామన్న పవన్ కళ్యాణ్

1694688628_q1.jpg

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్లో ఉన్న చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ ములాఖత్ అయ్యారు. నాలుగున్నరేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలన కొనసాగుతోందని పవన్ కళ్యాణ్ అన్నారు. అందులో భాగంగానే చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి రిమాండుకు పంపించారని విమర్శించారు. రాష్ట్రం బాగుండాలనే చంద్రబాబుకు మద్ధతు తెలుపుతున్నట్లు పవన్ స్పష్టం చేశారు. 

Prev Post ఎమ్మెల్సీ కవితకు ఈడీ...
Next Post తెలంగాణలో ఎప్పుడు ఎన...

More News