Friday, January 10
Breaking News:

రాష్ట్రంలో యూనివర్శిటీలు లేకుండా కేసీఆర్ కుట్ర- రేవంత్

1694672399_revanth reddy .jpg

రాష్ట్రంలో యూనివర్శిటీలు లేకుండా చేయాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని టీపీసీసీ చీఫ్ రేవంత్ ఆరోపించారు. ఇటీవల పోలీసుల చేతిలో గాయపడిన వరంగల్ కాకతీయ యూనివర్శిటీ విద్యార్థి సంఘం స్టూడెంట్స్‌ను రేవంత్ రెడ్డి పరామర్శించారు. వరంగల్ వెళ్లిన రేవంత్ రెడ్డి విద్యార్థులను కలిశారు. ఈ సందర్భంగా.. వర్శిటీలో పీహెచ్‌డీ అడ్మిషన్లలో జరిగిన అవకతవకలపై ప్రశ్నిస్తే విద్యార్థులపై దాడులు చేశారని నిప్పులు చెరిగారు. వీధి రౌడీలా మాదిరిగా విద్యార్థులను కొట్టిస్తున్నారని ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. యూనివర్శిటీల్లో జరిగే అన్యాయాలపైనే విద్యార్థులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని.. ప్రశ్నిస్తే విద్యార్థులను శత్రువుల మాదిరిగా చూస్తున్నారని ధ్వజమెత్తారు.

Prev Post ప్రభుత్వాస్పత్రిలో ఎ...
Next Post అనంత్‎నాగ్‎లో కాల్ప...

More News