Thursday, January 09
Breaking News:

రేపు, ఎల్లుండి హైదరాబాద్‌లో CWC సమావేశాలు సమావేశాలకు హాజరుకానున్న కాంగ్రెస్ అగ్ర నాయకులు

1694774316_WhatsApp_Image_2023-09-06_at_21.17.22-1694016902.jpeg

హైదరాబాద్ వేదికగా సీడబ్ల్యూసీ భేటీ కానుంది. ఇందుకోసం సర్వం సిద్ధమైంది. రెండు రోజుల పాటు హైదరాబాద్‌ వేదికగా జరిగే ఈ సమావేశాలకు కాంగ్రెస్ అగ్రనేతలు హాజరుకానున్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ భేటీకి ప్రాధాన్యత నెలకొంది. రేపు ఎల్లుండి కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. ఇందులో దేశ రాజకీయాలతో పాటు.. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల గురించి కూడా చర్చించనున్నారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో ఈ భేటీ జరగనుంది.

Prev Post టీబీజేపీ చీఫ్ కిషన్...
Next Post రాష్ట్రంలో 9 మెడికల్...

More News