Friday, January 10
Breaking News:

వాతావరణశాఖ హెచ్చరిక.. తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

1693552494_Telangana-Monsoons.jpg

తెలంగాణలో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. ఆంధ్రప్రదేశ్‌కు సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అలాగే సెప్టెంబర్‌ 4 వరకు వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో మరో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రం వైపు దిగువస్థాయిలో గాలులు వీస్తాయంటోంది హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం.

ఈ ఆవర్తనాల ప్రభావంతో.. తెలంగాణలో రెండు మూడు రోజులు తేలిక పాటి నుంచి ఒక మోస్తరు, భారీ వర్షాలు కొన్ని చోట్ల పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్‌ 2, 3,4 తేదీల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది అంటున్నారు. రాష్ట్రంలోని వరంగల్‌, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, ఆదిలాబాద్‌, కొమరం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు. ఆయా జిల్లాలకు మూడు రోజులు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

Prev Post ఐదురోజులపాటు పార్లమె...
Next Post తిరుమలలో కనిపించిన మ...

More News