Friday, January 10
Breaking News:

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు సోయం వీరభద్రం రాజీనామా

1693654250_aab.jpg

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైయస్ఆర్ టిపి జిల్లా అధ్యక్ష పదవికి సోయం వీరభద్రం శనివారం స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. తన ముఖ్య అనుచరులతో కేడర్ తో కలిసి రాజీనామాను దమ్మపేట మండలం కొమ్ముగూడెం లో తన నివాసంలో మీడియా ముఖంగా వెల్లడించారు. జిల్లా అధ్యక్షులుగా ఉన్న సోయం వీరభద్రం కి పార్టీ విలీనంపై కానీ పార్టీలో జరిగే కార్యక్రమాలకు ఎటువంటి సమాచారం లేనందువలన, పార్టీ కార్యక్రమాలు పై పార్టీ అధ్యక్షురాలు సరైన సమాచారం ఇవ్వని కారణంగా అసంతృప్తితో పార్టీకి రాజీనామా చేస్తున్నానని సోయం వీరభద్రం తెలిపారు. రాబోయే పది పదిహేను రోజులలో తను ఏ పార్టీలో చేరేది తన ముఖ్య అనుచరులతో కలిసి చర్చించి పార్టీలో చేరుతామని తెలిపారు. ఈ కార్యక్రమానికి అశ్వారావుపేట నియోజకవర్గం వివిధ మండలాల కోకన్వీనర్లు మండల అధ్యక్షులు పాల్గొన్నారు.

Prev Post మ‌ర‌పురాని మ‌హానేత‌క...
Next Post తెలుగు రాష్ట్రాల్లో...

More News