Friday, January 10
Breaking News:

సమాజానికి తుమ్మల నాగేశ్వరరావు అవసరం : టీపీసీసీ చీఫ్

1693551917_1200-675-19402022-85-19402022-1693490329193.jpg

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అసంతృప్త నేత తుమ్మల నాగేశ్వరరావుతో భేటీ అనంతరం మాట్లాడారు. కేసీఆర్ ను ఎదుర్కొనేందుకు అందరం ఏకమవుతున్నామని అన్నారు. సమాజానికి తుమ్మల నాగేశ్వరరావు వంటి నేతల అవసరం ఉందని తెలిపారు. అందుకే ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించామని వెల్లడించారు. తుమ్మల ఖమ్మం జిల్లానే కాదు… రాష్ట్రస్థాయిలో ప్రభావం చూపగల వ్యక్తి అని కొనియాడారు. తుమ్మలను రాజకీయాల్లో లేకుండా చేయాలని పాలేరు శాసనసభ్యుడు ఉపేందర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఉపేందర్ రెడ్డి అవినీతిలో కూరుకుపోయాడని రేవంత్ వ్యాఖ్యానించారు.

Prev Post ముగిసిన అమర్‌నాథ్ యా...
Next Post ఐదురోజులపాటు పార్లమె...

More News