Thursday, January 09
Breaking News:

119 నియోజకవర్గాలకు కాంగ్రెస్ ఇంచార్జ్‌ల నియామకం ప్రతీ ఇంటికి 6 గ్యారెంటీలను తీసుకెళ్లేలా వ్యూహా రచన

1694950298_asa.jpg

తెలంగాణ రాష్ట్రాన్ని సోనియాగాంధీ ఇచ్చారని సీడబ్ల్యూసీ స్పష్టం చేసింది. తొమ్మిదేళ్లు గడిచినా కేంద్రం-కేసీఆర్ ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తునే ఉన్నాయన్నారు. కేసీఆర్ కుటుంబ పాలనకు తెరలేపి ప్రజా సమస్యలు మర్చిపోయారని సీడబ్ల్యూసీ ఆరోపించింది. సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణను కాదు నిజాం పరిపాలనా తీసుకొచ్చారని సీడబ్ల్యూసీ విమర్శించింది. రాహుల్‎గాంధీ తెలంగాణలో 405 కిలో మీటర్ల పాదయాత్ర చేశారని, ఇందిరాగాంధీ హయంలో ఇచ్చిన భూములను సైతం కేసీఆర్ లాక్కున్నారని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలు-డిక్లరేషన్‎లతో తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని సీడబ్ల్యూసీ ధీమా వ్యక్తం చేసింది. 

Prev Post మరికాసేపట్లో తుక్కుగ...
Next Post తెలంగాణలో అధికారంలోక...

More News