Thursday, January 09
Breaking News:

4 సార్లు దాస్యం వినయ్ భాస్కర్ ను వరంగల్ ఎమ్మెల్యేగా గెలిపిస్తే అభివృద్ధి ఏమీ లేదని - నాయిని రాజేందర్ రెడ్డి

1693815076_aab.jpg

నాలుగు సార్లు దాస్యం వినయ్ భాస్కర్ ను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే చేసిన అభివృద్ధి ఏమీ లేదని కాంగ్రెస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఏఐసీసీ అబ్జర్వర్, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి రవీంద్ర ఉత్తమ్ రావుతో కల్సి 30వ డివిజన్ లో కాంగ్రెస్ సంకల్ప యాత్ర చేశారు. హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి యాత్ర ప్రారంభించారు. భూ కబ్జాలకు అడ్డగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని మార్చిన దాస్యం వినయ్ భాస్కర్ కు రాబోయే ఎన్నికలలో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.

Prev Post మంత్రి మహేందర్ రెడ్డ...
Next Post గట్టుపల్లి నుండి కాం...

More News