నిరుపేద కుటుంబంలోని విద్యార్థుల ఉన్నత విద్యకు చేతనందిస్తూ వారి కనీస అవసరాలకు, కళాశాలల వసతి గృహాల ఫీజులకు మద్దూరి ఫౌండేషన్ తరపున ఆర్థిక సాయం అందిస్తూ విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న మద్దూరి ఫౌండేషన్ చైర్మన్ బిసి సంక్షేమ సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మద్దూరి అశోక్ గౌడ్ సామాజిక సేవా కార్యక్రమాలను నిస్వార్ధ సేవలను నియోజకవర్గ ప్రజలు కొనియాడుతున్నారు. నియోజకవర్గ పరిధిలోని వివిద గ్రామాల్లోని నిరుపేద మరియు గవర్నమెంట్ పాఠశాల కళాశాల కు నిరుపేద విద్యార్థుల ఉన్నత విద్యకు ఫౌండేషన్ తరపున ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇందులో భాగంగానే సోమవారం షాద్ నగర్ నియోజకవర్గానికి చెందిన చిలకమర్రి గ్రామ నిరుపేద విద్యార్థిని సబితా ఉన్నత విద్యకు ఆర్థిక సహాయాన్ని అందించారు. సబితా ఉన్నత విద్య కు కావాల్సిన డబ్బును తన కార్యాలయంలో కుటుంబ సభ్యులకు అందజేశారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు విద్యార్థుల విద్యకు ఆటకం కాకూడదని ఉద్దేశంతో విద్యార్థులకు ఫౌండేషన్ తరపున ఆర్థిక సాయం అందిస్తున్నట్లు చైర్మన్ అశోక్ గౌడ్ తెలిపారు. గత కొన్ని రోజులుగా నియోజకవర్గం చెందిన ఎంతోమంది నిరుపేద విద్యార్థిని విద్యార్థులకు తోడ్పాటు అందించినట్లు తెలిపారు అశోక్ గౌడ్ విద్యాభివృద్ధికి చేస్తున్న కృషిని నియోజకవర్గ ప్రజలు విద్యావేత్తలు కొని ఆడుతున్నారు సామాజిక సేవా కార్యక్రమాలతోపాటు విద్యాభివృద్ధికి తోడ్పాటు అందించడం అభినందనీయమని ప్రశంసలు కురిపిస్తున్నారు ఉన్నదాంట్లో ఇతరులకు ఉపయోగపడే విధంగా సాయం చేయడం మనిషిగా ప్రతి ఒక్కరి కర్తవ్యం అని ప్రతి ఒక్కరు సేవ గుణాన్ని దాతృత్వాన్ని చాటాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి జీ. సిద్ధార్థ, మాధవ రెడ్డి,సునీల్,చారి,రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు..