Thursday, November 21
Breaking News:

మమ్మీలో కోట్లు విలువైన బంగారం..

mummy

సీటీ స్కాన్‌తో వెలుగులోకి..
పరిశోధకులు విస్మయం!
ఈజిప్టు పేరు చెప్పగానే పిరమిడ్లు, మమ్మీలు గుర్తుకొస్తాయి. వందేళ్ల కిందట ఓ మమ్మీని పురావస్తుశాఖ అధికారులు గుర్తించారు. దానిని పూర్తిగా పరిశీలించకుండా సాధారణ మమ్మీలానే భావించి కైరోలోని ఓ మ్యూజియంలో భద్రపరిచారు. వందేళ్ల పాటు అక్కడే ఉండిపోయిన ఆ మమ్మీకి.. తాజాగా పరిశోధక బృందం సిటీ స్కాన్‌ చేసింది. అప్పటివరకూ మూలనపడేసిన ఆ మమ్మీలో కోట్లాది రూపాయల విలువ చేసే బంగారం ఉండటం చూసి పరిశోధకులు ఆశ్చర్యపోయారు. బంగారంతో పాటు ఎన్నో రహస్యాలు ఈ సిటీ స్కాన్‌తో వెలుగులోకి వచ్చాయి. బంగారంతో చేసిన అవయవాలు ఉండటం విశేషం.

మమ్మీ గుండె, నాలుక, చేతులు సహా మరికొన్ని శరీర భాగాల స్థానంలో బంగారంతో చేసిన అవయవాలు ఉన్నాయి. సుమారు 14 ఏళ్ల వయసులో చనిపోయి ఉంటాడని భావిస్తోన్న బాలుడికి సంబంధించిన ఈ మమ్మీ.. 1916 నాటి పురావస్తు తవ్వకాల్లో బయటపడిరది. దీనిని పూర్తిగా పరిశీలించకుండా ఇతరవాటితో కలిపి కైరో మ్యూజియం స్టోర్‌ రూమ్‌లో పడేశారు. కైరో యూనివర్సిటీకి చెందిన డాక్టర్‌ సహర్‌ సలీమ్‌ బృందం.. సీటీ స్కాన్‌ చేయించగా లోపల ఏముందో బయటపడిరది. తాయత్తుల్లాంటి 49 వస్తువులు గుర్తించగా.. వాటిలో చాలా మటుకు బంగారంతో చేసినవే. అందుకే దీనిని గోల్డెన్‌ బాయ్‌గా వ్యవహరిస్తున్నారు. బంగారు నాలుక, గుండె స్థానంలో బంగారంతో చేసిన వస్తువు ఉంది.

ఈజిప్షియన్‌ విశ్వాసాల ప్రకారం.. దేవతల రంగు బంగారం.. చనిపోయినవారి శరీరాలను బంగారు పూతతో వారు మరణానంతర జీవితంలో దైవిక లక్షణాలను పొందుతారనేది నమ్మకం. అందుకే హెకాషెపెస్‌ పునర్జన్మ పొందుతాడని, మరణానంతర పునరుజ్జీవింపబడతాడనే నమ్మకంతో బంగారంతో తయారుచేసిన అవయవాలను ఉంచారని అంటున్నారు.

Prev Post టెన్త్ ఆన్సర్ షీట్ బ...
Next Post టర్కీ, సిరియా దేశాల్...

More News