Thursday, November 21
Breaking News:

టెన్త్ పేపర్ లీక్ ఘటనపై మంత్రి సబితా సీరియస్

టెన్త్ పేపర్ లీక్ ఘటనపై మంత్రి సబితా సీరియస్

పదో తరగతి పరీక్ష ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్వీట్ చేశారు. పరీక్షల సమయంలో జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యాలు, పోలీసు విభాగం, పోస్టల్ డిపార్ట్ మెంట్, వైద్యారోగ్య శాఖ అధికారులు, ఆర్టీసీ అధికారులు సమన్వయంతో పనిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. నాలుగు లక్షల 95వేల మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బాధ్యతగా పనిచేద్దామని మంత్రి తెలిపారు.

మొదటిసారి బోర్డు ఎగ్జామ్స్ రాస్తున్న చిన్నారులను గందరగోళ పరిస్థితులకు గురిచేయడానికి ఎవరు ప్రయత్నించినా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి హెచ్చరించారు. విద్యార్థుల పరీక్షల సమయంలో రాజకీయ స్వార్థం, వ్యక్తిగత స్వార్థం పక్కన పెట్టాలని ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నానని ఆమె ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు. ఏప్రిల్ 3నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కాగా.. మొదటి రోజే వికారాబాద్ లోని తాండూరులో ప్రశ్నపత్రం లీక్ అయిందన్న వార్త రాష్ట్రమంతటా సంచలనంగా మారింది. ఈ ఘటనలో ఇన్వాల్వ్ అయిన ముగ్గురిని అరెస్టు చేశారు. ఏప్రిల్ 4న కండక్ట్ చేసిన హిందీ పేపర్ సైతం వరంగల్ జిల్లాలో లీక్ కావడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తొలిరోజు తెలుగు ప్రశ్నాపత్రం, రెండో రోజూ హిందీ పేపర్ కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావటం పట్ల తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. ఘటనపై ఆరా తీసిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. వరంగల్‌, హనుమకొండ డీఈవోలతో ఫోన్‌లో మాట్లాడారు. పేపర్ లీక్ ఘటనపై వరంగల్‌ సీపీకి ఫిర్యాదు చేయాలని ఆదేశించారు. లీక్ ఘటనపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్వీట్ చేశారు.

“పదవ తరగతి పరీక్షల విషయంలో జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, పాఠశాలల యాజమాన్యాలు, పోలీసు విభాగం, పోస్టల్ డిపార్ట్‌మెంట్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆర్టీసీ అధికారులు సమన్వయంతో పని చేయాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. నాలుగు లక్షల 95 వేల మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బాధ్యతగా పనిచేద్దామని తెలియజేసుకుంటన్నాను. మెుదటిసారి బోర్డు ఎగ్జామ్స్ రాస్తున్న చిన్నారులను గందరగోళ పరిస్థితులకు గురిచేయడానికి ఎవరు ప్రయత్నించినా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. విద్యార్థుల పరీక్షల విషయంలో రాజకీయ స్వార్థం, వ్యక్తిగత స్వార్థం పక్కన పెట్టాలని మనవి” అంటూ సబితా ఇంద్రారెడ్డి ట్వీట్ చేశారు.

Trending
Prev Post Trending
lorry
Next Post బోల్తాపడిన ప్రైవేటు...

More News