Thursday, January 09
Breaking News:

ధనవంతులకే ధరణి సర్కార్‌పై - వీహెచ్ ఫైర్

1694499570_1600x960_1106088-v-hanumantha-rao.jpg

రాష్ట్ర ప్రభుత్వం పేదల భూములను లాక్కొని వెంచర్లకు అమ్మేస్తుందని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీహెచ్ ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ ప్రతి కుటుంబానికి భూమి, డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారని ఆయన విమర్శించారు. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ... ధరణి ధనవంతులకే ఉపయోగపడుతుందని, పేదలకు,రైతులకు కాదని అన్నారు.కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం కేవలం భూస్వాములు, కార్పోరేట్ల కోసం పనిచేస్తాయన్నారు. పేదలను వారు పట్టించుకోరన్నారు. ఇప్పుడు కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాలు అమ్ముతున్నారని.. భవిష్యత్‌లో వారికి ఫుట్‌పాత్‌పై పడుకునే పరిస్థితి వస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Prev Post కాంగ్రెస్ అధికారంలోక...
Next Post గిరిజనోద్ధారకుడు సీఎ...

More News